మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Venkateshwara Dwadasha Nama Stotram – శ్రీ వేంకటేశ ద్వాదశనామ స్తోత్రం
అస్య శ్రీ వేంకటేశ ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ వేంకటేశ్వరో దేవతా ఇష్టార్థే వినియోగః |
నారాయణో జగన్నాథో వారిజాసనవందితః |
స్వామిపుష్కరిణీవాసీ శంఖచక్రగదాధరః || 1 ||
పీతాంబరధరో దేవో గరుడాసనశోభితః |
కందర్పకోటిలావణ్యః కమలాయతలోచనః || 2 ||
ఇందిరాపతిగోవిందః చంద్రసూర్యప్రభాకరః |
విశ్వాత్మా విశ్వలోకేశో జయ శ్రీవేంకటేశ్వరః || 3 ||
ఏతద్ద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
దారిద్ర్యదుఃఖనిర్ముక్తో ధనధాన్యసమృద్ధిమాన్ || 4 ||
జనవశ్యం రాజవశ్యం సర్వకామార్థసిద్ధిదమ్ |
దివ్యతేజః సమాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి || 5 ||
గ్రహరోగాదినాశం చ కామితార్థఫలప్రదమ్ |
ఇహ జన్మని సౌఖ్యం చ విష్ణుసాయుజ్యమాప్నుయాత్ || 6 ||
ఇతి బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే శ్రీ వేంకటేశద్వాదశనామస్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.